హోలీ శుభ సందర్భంగా, మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది మొత్తం టీం వారి ముఖాల్లో ఆనందంతో నిండినట్లు చూపిస్తుంది. సాయితేజ్ తన టీం ఉత్సాహపరిచేందుకు తన చేతిని పైకెత్తడం కనిపిస్తుంది. ఈ గెస్చర్ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది.
భారీ బడ్జెట్‌తో సంబరాల యేటిగట్టు సాయి దుర్గ తేజ్‌కు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌లో అద్భుతమైన సాంకేతిక బృందం ఉంది. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నవీన్ విజయ కృష్ణ ఎడిటింగ్, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు
ఐశ్వర్య లక్ష్మి నాయికగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.