బిగ్ బాస్ మూడో సీజన్‌లో మూడు వారాల పాటు హేమ, జాఫర్, తమన్నా ఎలిమినేట్ అయ్యారు, ఒక్కో వారం నామినేషన్స్ మొదలైన తర్వాత టెన్షన్ కూడా అలాగే పెరుగుతుంది. ఈ వారం కూడా ఇదే జరిగింది. ఎప్పట్లాగే నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇందులో ఇద్దరు కంటెస్టెంట్స్‌ను పంపించి నేరుగా నామినేట్ చేసాడు బిగ్ బాస్.
వాళ్లే శివజ్యోతి, రోహిణి. సాధారణంగా నామినేషన్స్ జరుగుతున్న సమయంలో మాట్లాడకూడదని నియమం వుంది. కానీ అప్పటికే తమ నామినేషన్ పూర్తి చేసుకుని వచ్చారు శివజ్యోతి, రోహిణి. అందులో రోహిణి తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది.
ఇకపోతే, బిగ్ బాస్ మూడో సీజన్‌లో వరుణ్ సందేశ్, వితిక షెరూ రొమాన్స్ హద్దులు దాటేస్తున్నాయి. ఇక కెమెరాలకు ఎలాగూ కళ్లున్నాయి కాబట్టి వద్దన్నా కూడా అవి క్యాప్చర్ చేస్తున్నాయి. ముద్దులు పెట్టుకుంటూ.. హగ్స్ ఇచ్చుకుంటూ ఒకరికొకరు బూస్టప్ ఇచ్చుకుంటున్నారు.