సాయి కుమార్, సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్ చందర్, రాజీవ్ కనకాల నటీనటులుగా శాంతి కుమార్ తుర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం`నాతో నేన. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్,సీనియర్ నటుడు విజయ చందర్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ,హీరో ఆది సాయి కుమార్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ నిచ్చారు. ఆది సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం చిత్ర దర్శకుడు శాంతికుమార్ తుర్లపాటి మాట్లాడుతూ, మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన నేను చిన్న కళాకారుడు స్థాయినుంచి ఈరోజు డైరెక్టర్ స్థాయికి వచ్చాను అంటే దానికి కారణం నా గాడ్ ఫాదర్ మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి గారు. శాంతి కుమార్ అనే వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయన, అలాంటి వ్యక్తికి నేను ఏంతో ఋణపడి ఉన్నాను వారికి నా ధన్యవాదాలు.
ఈ "నాతో నేను" జర్నీ నిజంగా ఒక పాండమిక్ టైం లో ఒంటరిగా ఫీల్ అయి నటువంటి సిచ్చువేషన్ లో నా కనిపించిన విషయాన్ని కథగా తయారుచేసుకున్నాను. నేను చిన్నప్పటినుంచి రైటర్ ని ఒక మంచి కథ రాసుకొని సినిమా తీయాలను కొని మంచి కథ రాసుకోవడం జరిగింది కరోనా వలన అందరూ లాక్డౌన్ ఉన్న టైంలో 8 నెలలు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి , డైలాగ్స్ తో సహా రాసుకున్నాను. ఈ సినిమాకు కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారని అన్నారు.
చిత్ర సమర్పకులు ఎల్లాలు బాబు టంగుటూరి మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల నుంచి సినిమా తీయాలనే ఆలోచన ఉంది కానీ నాకు శాంతికుమార్ రూపంల కథ చెప్పడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. ఈ సినిమా ద్వారా మా కొడుకు ప్రశాంత్ ని పెద్ద నిర్మాతగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, శాంతి కుమార్ మంచి కథతో కథనంతో ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని వచ్చి నాకు కథ చెప్పడంతో నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాకు మంచి నిర్మాతలు దొరికారు. మంచి టెక్నీషియన్స్ మంచి క్యాస్టింగ్ కూడా సెట్ అయ్యింది. ఈ కథ కు నేషనల్ అవార్డు కూడా వచ్చేటటు వంటి మంచి స్క్రిప్టు.కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. అందరూ ఈ టైటిల్ బాగుందని మెచ్చుకుంటున్నారు. టైటిల్ తగ్గట్టు కథ ఉన్నందుకు ఈ సినిమా గొప్ప విజయం సాదించడమే కాక ఈ సినిమా ద్వారా నిర్మాతలు నంద్యాల కి మంచి గుర్తింపు తీసుకు వస్తారని అన్నారు
చిత్ర హీరో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..సాయి కుమార్ వాయిస్ పరంగా, యాక్టింగ్ పరంగా తను ఒక స్పెషల్. అలాంటి ఆయనతో నేను ఈ సినిమాలో పార్ట్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ సినిమా లైఫ్ లాంగ్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆవ్వాలని కోరుతున్నానని తెలిపారు.