"కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని సంపాదించుకున్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరమైన విషయం" అంటూ ట్వీట్ చేశారు.
సినీ హీరోయిన్ అనుష్క శెట్టి తన ట్విట్టర్ ఖాతాలో సంతాపం తెలిపారు. "కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని, ఒక లెజండ్, విశాలహృదయుడు అయన కృష్ణంరాజు మా హృదయాల్లో జీవిస్తారని" పేర్కొన్నారు.