సుధీర్ బాబు నూతన చిత్రం పోస్టర్ ఆసక్తికలిగించేలా వుంది. ఇందులో సుధీర్ బాబు షర్ట్ లెస్ గా, సాలిడ్ ఫిజిక్ తో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. మెట్లపై మృతదేహాలు పడిపోతుండగా, ఆయన ఒక చేతిలో ఆయుధాన్ని పట్టుకుని పైకెత్తుతూ కనిపించడం చాలా క్యూరియాసిటీని పెంచింది. #PMFxSB సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందించబడుతోంది. పోస్టర్లోనే ఉత్కంఠను పెంచుతూ, ఇంటెన్స్ మూడ్‌ను సెట్ చేసింది. "A Broken Soul On A Brutal Celebration" అనే ట్యాగ్‌లైన్ సుధీర్ బాబు క్యారెక్టర్ డెప్త్ ని తెలియజేస్తోంది.