నాకు ఒక వీక్‌నెస్ అది. ఎవరు ఏది అడిగినా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేయడం నాకు అలవాటు. చిన్నప్పటి నుంచి ఇదే నాకు బాగా అలవాటు. తల్లిదండ్రులు కూడా నన్ను మందలించేవారు. కానీ అది అలవాటుగా మారిపోయింది కాబట్టి ఏమీ చేయలేను. కష్టాల్లో ఉన్న వారు ఏదైనా అడిగితే వెంటనే ఇచ్చేయడం నాకు అలవాటు. డబ్బులు అడిగినా, ఇక వేరే ఏ సహాయం అడిగినా నా దగ్గర ఉంటే ఇచ్చేస్తాను అని చెపుతోంది శ్రుతి హాసన్.
'సినీ పరిశ్రమలో చాలామంది ఈ విషయంపై నన్ను హెచ్చరించారు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు దాని గురించి కనుక్కున్న తరువాతనే ఇవ్వాలి తప్ప ఠక్కున ఇచ్చేయడం మంచిది కాదు. ఇది మానుకో అంటూ స్నేహితులు, బంధువులు చెబుతూ వచ్చారు. కానీ ఎంత అనుకున్నా నాకు మార్చుకోవడం సాధ్యం కాలేదు. సీనియర్ నటులు నా పక్కన వుండి సహాయం అని ఎవరైనా వస్తే వారు ఇచ్చినా ఇవ్వకున్నా నేనే ఇచ్చేస్తుంటాను. చాలామంది జలసీగా ఫీలవుతారు. నేను అదంతా పట్టించుకోను' అంటోంది శృతి హాసన్.