వేదిక డ్యూయల్ రోల్ చేసిన ఫియర్ మూవీ థ్రిల్ కలిగిస్తుంది : డా.హరిత గోగినేని

డీవీ

గురువారం, 12 డిశెంబరు 2024 (13:30 IST)
Abi, harita, sohel
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటించిన సినిమా "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్.‌ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందించారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "ఫియర్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 
 
డైరెక్టర్ డా. హరిత గోగినేని మాట్లాడుతూ - "ఫియర్" స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్ మూవీ. ఒక కాన్సెప్ట్ తో వెళ్తుంది. సరికొత్త స్క్రీన్ ప్లే ఉంది కాబట్టే 70 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.  "ఫియర్" లో వేదిక డ్యూయల్ రోల్ చేసిందనే విషయాన్ని ఈ ఈవెంట్ లో రివీల్ చేస్తున్నాం. మా సినిమాకు యూఏ సర్టిఫికేషన్ వచ్చింది. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. పెద్ద సినిమా థియేటర్ లో , చిన్న సినిమా ఓటీటీలో చూద్దామనే భావన మన ఆడియెన్స్ లో వచ్చేసింది. అయితే థియేటర్ లో ఆదరిస్తేనే ఓటీటీలోకి చిన్న చిత్రాలు వెళ్తాయి. అందుకే చిన్న సినిమాను మీరంతా ఆదరించాలని కోరుతున్నా. నేనొక మూవీ లవర్ ను, ప్రతి సినిమా ఫస్ట్ షో చూస్తా. ఈ స్క్రిప్ట్ వినగానే అభి తప్పకుండా మూవీ చేద్దామని ఎంకరేజ్ చేశారు. అలాగే నా ఫ్రెండ్ సుజాత రెడ్డి కో ప్రొడ్యూస్ చేశారు. హీరోయిన్ వేదిక బంగారం. మా మూవీకి ఎంతో సపోర్ట్ చేసింది. అలాగే చిన్న క్యారెక్టర్ అయినా అరవింద్ కృష్ణ చేశాడు. అనూప్ రూబెన్స్ గారికి చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధం లేదు. మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఆండ్రూ గారి విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి. 
 
మేము లక్కీ లక్ష్మణ్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. మాతో పనిచేసిన వారు, ఫ్యామిలీలా మారిపోతారు. ఆ ప్రేమను సంపాదించుకున్నాం. అచ్చి బాబు గారు మాకు చాలా థియేటర్స్ ఇప్పిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఫియర్ సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి గురించి మూవీ రిలీజ్ అయ్యాక మాట్లాడుతా. ఫీమేల్ డైరెక్టర్స్ మనకు చాలా తక్కువ.  మీ ఇంట్లో అమ్మాయి తీసిన సినిమా అనుకుని "ఫియర్" చూడండి. అన్నారు.
 
హీరో సొహైల్ మాట్లాడుతూ - హరిత, అభి గారితో లక్కీ లక్ష్మణ్ మూవీ చేశాను. వీళ్లిద్దరూ చాలా జెన్యూన్ పర్సన్స్, సినిమా కోసం ధైర్యంగా అడుగు వేస్తారు. మనం లవ్ స్టోరీస్, థ్రిల్లర్స్, హారర్ మూవీస్ చూసి ఉంటాం. కానీ "ఫియర్" సినిమాలో లవ్ స్టోరీతో పాటు థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్ కలిసిన ఒక కొత్త తరహా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇలాంటి స్క్రిప్ట్ స్కీన్ ప్లేతో తెలుగులో మూవీ రాలేదని చెప్పగలను. "ఫియర్" కంటెంట్ చాలా బాగుంది. వేదిక గారి పర్ ఫార్మెన్స్, అనూప్ గారి మ్యూజిక్, ఆండ్రూ గారి విజువల్స్..ఇవన్నీ హైలైట్ అవుతాయి. ఈ సినిమా తప్పకుండా థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - "ఫియర్" సినిమా హరిత గారు వన్ మ్యాన్ ఆర్మీ లాగ ఆమె ఈ మూవీ చేశారు. అభి, హరిత మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఈ మూవీ కోసం ఎంతో కష్టపడి ఈ నెల 14న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. వేదిక గారి పర్ ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. "ఫియర్" మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అన్నారు.
 
ప్రొడ్యూసర్ ఏఆర్ అభి మాట్లాడుతూ, హీరోయిన్ వేదిక మా మూవీకి ఎంతో సపోర్ట్ చేశారు. నాలుగు భాషల్లో హీరోలతో టీజర్ రిలీజ్ చేయించారు. నా వైఫ్ హరితకు పట్టుదల ఎక్కువ. స్క్రిప్ట్ మీద పూర్తి నమ్మకంతో మూవీ  చేసింది. "ఫియర్" లో నటించిన ఆర్టిస్టులంతా మాకు సపోర్ట్ చేశారు. కో ప్రొడ్యూసర్ సుజాత రెడ్డి సహకారం అందించారు. నిర్మాతగా రెండు చిత్రాలు పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నా. నెక్ట్ మూవీ స్టార్ట్ చేస్తున్నాం. మా "ఫియర్" సినిమా టీజర్, పాటలు చూడండి మీకు నచ్చితే థియేటర్స్ కు వెళ్లి చూడండి. ఈ నెల 12 నుంచి పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా 70 పర్సెంట్ బుకింగ్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ప్రీమియర్స్ మిస్ అయినవాళ్లు 14న థియేటర్స్ లో "ఫియర్" సినిమా చూడండి.  అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు