ఇద్దరు డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ సినిమా వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో ప్రదీప్, దీపిక పిల్లిని ఒక రౌడీ గ్యాంగ్ వెంబడిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్.