"బాడీగార్డ్" ఇక్కడ జనవరి 12- అక్కడ జనవరి 9 విడుదల

బుధవారం, 21 డిశెంబరు 2011 (20:50 IST)
WD
తెలుగు సినిమా మూడురోజుల ముందుగా విదేశాల్లో రిలీజ్‌ చేయడం విశేషం. విక్టరీ వెంకటేష్‌, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన 'బాడీగార్డ్‌' సినిమా ముందుగా యు.ఎస్‌.లో విడుదల కానుంది. ఇలా ఎందుకు చేస్తున్నామంటే.. అక్కడ షోలు ఎక్కువగా ప్రదర్శించడానికి అనుకూలంగా ఉంది.

అభిమానులు, ప్రేక్షకులు ముందుగా చూడాలని కోరారని చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, జనవరి 1వ తేదీన బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు మాత్రం సినిమాను ప్రత్యేకంగా చూపిస్తున్నాం. సినిమా చూపించి కొనమని అడగుతున్నాం. చూపించకుండా మోసం చేసి సినిమా అమ్మడం నా పాలసీ కాదు అని చెప్పారు.

వెంకటేష్‌ మాట్లాడుతూ, ఈనెల 31న ఫస్ట్‌ కాపీ వస్తుంది. జనవరి 12న సినిమా విడుదలవుతుంది. ఆడియో ఇప్పటికే హిట్‌ అయిందని ఆదిత్య మ్యూజిక్‌ సంస్థ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు, సినిమాకు బాగా హెల్ప్‌ అవుతుంది అన్నారు.

త్రిషతో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది. నటనకు బాగా అవకాశమున్న పాత్ర ఆమెది. అన్ని భాషల్లోనూ విడుదలై సక్సెస్‌ అయినట్లు తెలుగులోనూ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. యాక్షన్‌ సీన్స్‌ ఉన్నా... యాక్షన్‌ సినిమా చేసి చాలా రోజులైంది. అందుకే ఈ సినిమాలో యాక్షన్‌ చేశాను అన్నారు.

త్రిష మాట్లాడుతూ, వెంకీతో హ్యాట్రిక్‌ సినిమా చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మూడు భాషల్లో హిట్‌ అయినట్లే తెలుగులోనూ హిట్‌ అవుతుందని అన్నారు.

వెబ్దునియా పై చదవండి