తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటేనే ఒక పండుగ. అలాంటిది బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ అంటే ఇక చెప్పనవసరం లేదు. ఇసుకేస్తే రాలనంత జనం. ప్రతి గరుడ వాహనసేవకు లక్షలాదిమంది భక్తులు తిరుమల కొండపైకి తరలివస్తారు. మంగళవారం మధ్యాహ్నానికే రెండున్నర లక్షమంది ఉన్న తిరుమలలో ప్రస్తుతం మరో రెండున్నర లక్షల మందికి పెరిగి మొత్తం 5 లక్షల మందికి చేరుకుంది. గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మంచిదన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమ్మకం కూడా.
తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచే భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రి జరిగే గరుడ వాహనసేవకు ఇప్పటికే తితిదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాత్రి 7.30 నిమిషాలకే గరుడ వాహన సేవను టిటిడి నిర్వహించనుంది. గ్యాలరీలన్నీ ఇప్పటికీ భక్తులతో నిండిపోయాయి.