బసవరాజు బొమ్మైకే బొమ్మ పడింది, కర్నాటక సీఎం కుర్చీ ఆయనదే...

మంగళవారం, 27 జులై 2021 (21:33 IST)
యడ్యూరప్పను కర్నాకట సీఎం కుర్చీ పదేపదే వెక్కిరించడం మామూలే. ఆయన ఆ కుర్చీపైన కుదురుగా కూర్చునే యోగం అయితే లేదని కర్నాటకలోని జ్యోతిష పండితులు చెప్పే మాట. అదే మరోసారి నిజమయ్యిందనుకోండి. ఇకపోతే యడ్యూరప్ప రాజీనామా చేసిన నేపధ్యంలో ఆ పదవిని తన కుమారుడికి అప్పజెప్పాలని యడ్డి డిమాండ్ చేసారు. కానీ అవేవీ భాజపా అధిష్టానం పట్టించుకోలేదు.
 
సీఎం పీఠం రేసులో ఎంతమంది వున్నప్పటికీ చివరికి కర్నాటక హోంమంత్రి బసవరాజు బొమ్మైకే బొమ్మ పడింది. తాజా మాజీముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా బసవరాజుకే మద్దతు తెలపడంతో సీఎం పీఠం ఆయనకే దక్కింది. మరో రెండు రోజుల్లో ఆయన సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు