అలనాడు వీర బ్రహ్మంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం ఒక్కొక్కటి నిజం అవుతూ వస్తోంది. కోడి పెట్ట గుడ్డు పెట్టడం... పిల్లన్ని పొదగడం కామన్. ఇక్కడ కోడిపుంజు గుడ్లు పెట్టింది... తన పిల్లన్ని పొదిగి పెద్ద చేస్తోంది. అకటా... ఇది ఎక్కడో కాదు... సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి సంచరించిన శ్రీకాళహస్తిలోనే.
ఈయన కోడి పుంజులు వేకువజామునే కూత వేసి నిద్రలేపేవి. తరుచు కొట్లాడుకునేవి... ఇవి మామూలే అనుకునేవాడు సుబ్రహ్మణ్యం. తీరా చూస్తే, తన ఇంట్లో నాటు కోడి పుంజు గుడ్లు పెట్టి పిల్లలు చేసి... వాటిని కంటికిరెప్పలా కాపాడుతోంది.
గ్రామంలో వింత చోటుచేసుకోవడంతో ఈ వింతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి వింత కలికాలం అంటున్నారు. దీనిపై వైద్య అధికారిని వివరణ అడగగా, జన్యు లోపం వల్ల అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని తెలిపారు. జన్యులోపం సంగతి పక్కన పెడితే.. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇలా జరుగుతుందని వుంది మరి.