ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పంటకు మిడతలు నష్టం కలిగించాయి. 35వేల మందికి సరిపడా ఆహారాన్ని ఈ దండు ఒక్కరోజులో తినేస్తాయట. ఇవి వాటి శరీర బరువుకు మించి ఆహారం తీసుకుంటాయి.
చేతికొచ్చిన పంటను ఈ మిడతల ద్వారా నష్టపోతుంటే చూస్తూ ఉండలేక రైతులు డప్పు కొట్టడం, చప్పట్లు కొట్టడం లాంటి పనులు చేస్తున్నారు. నిరంతరం ఈ పనులు చేయడం కష్టమని డీజే వాహనాన్ని తరలించి పంటపొలాల్లో ప్లే చేస్తున్నారు రైతులు. ఈ శబ్దానికి మిడతలు తోక ముడవక తప్పదంటున్నారు.