బడ్జెట్ 2018, ప్రధాని మోదీ చెప్పింది చేయలేకోపోతున్నారా? ఏంటది?

బుధవారం, 31 జనవరి 2018 (16:25 IST)
భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో నిరుద్యోగ సమస్య కూడా ఒకటి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చదువు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడంలేదు. దానితో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మరోవైపు కొన్ని కంపెనీలు వారి నిరుద్యోగ సమస్యను క్యాష్ చేసుకుంటున్నాయి. తక్కువ వేతనంతో వారి నుంచి పనిని పిండుకుంటున్నాయి. అసలు నరేంద్ర మోదీ నిరుద్యోగులకు ఎలాంటి హామీ ఇచ్చారంటే... ఏడాదికి కనీసం కోటి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇది 2014 మే నెలలో ఇచ్చిన మాట. 
 
కానీ జరిగింది ఏమిటి? ఇప్పటివరకూ అంటే... అక్టోబరు నెల వరకూ కేవలం 8, 23,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగారు. దీనితో నిరుద్యోగ సమస్య తీవ్రతరమైపోతోంది. ఈ పరిస్థితిని దాటి ముందుకు సాగాలంటే కనీసం ఏడాదికి పది లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించాల్సి వుంటుంది. ఈ విషయంలో మోదీ సర్కార్ విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ 2018-19 బడ్జెట్టులో మోదీ సర్కార్ ఈ దిశగా ఏమయినా ప్రయత్నాలు చేస్తుందా అని యువత ఎదురుచూస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు