వినాయక చవితి రోజున శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిఃలోని నామాలు చదువుతూ.. స్వామిని పూలతో గానీ, అక్షతలతో గానీ పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. ఈ శతనామావళి చదవడం ద్వారా విఘ్నాలను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.