తన మాతృమూర్తి నుంచి తెలుసుకున్న చర్మ సంరక్షణ చిట్కాలను పంచుకున్న సోహా అలీఖాన్‌

శుక్రవారం, 21 జనవరి 2022 (17:09 IST)
మనం ఎదిగే క్రమంలో, మనమెప్పుడూ మన మాతృమూర్తిని చూస్తూనే ఎదగడం మాత్రమే కాదు, వారు చేసినట్లుగానే చేయాలని తలపోస్తుంటాము. అమ్మ, మన జీవితంలో పలు ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంటుంది. మార్గదర్శిగా, ఉపాధ్యాయినిగా, మెంటార్‌గా, స్నేహితురాలిగా... ఆమెతో నెరిపే బంధం ప్రత్యేకం. ఈ బహుముఖ బంధం ఎన్నో విధాలుగా వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ బంధానికి చక్కటి ఉదాహరణ సోహా అలీఖాన్‌ మరియు ఆమె తల్లి. మనకు లక్ష్యాలను అందించడంలో ఎప్పుడూ విఫలం కాని వ్యక్తిగా, అది అతి సరళమైన నుస్కా లేదా ఫ్యామిలీ రెసిపీలు కావొచ్చు, తన అందమైన తల్లి షర్మిలా ఠాగూర్‌ నుంచి గ్రహించిన చర్మ సంరక్షణ చిట్కాలను సోహా ఎలా పంచుకుందంటే...

 
ఆరోగ్యవంతమైన చర్మం అనేది మనం తినే ఆరోగ్యవంతమైన ఆహారంపై ఆధారపడి ఉంటుంది
మన చర్మపు ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం, ఆరోగ్యవంతమైన డైట్‌ స్వీకరించడంపై ఆధారపడి ఉంటుంది. ‘‘ప్రొటీన్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌, చక్కటి ఫ్యాట్స్‌, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఆహారం ఖచ్చితంగా మనకు సహాయపడుతుంది. అలాంటి ఆహారపదార్థాలలో నాతో పాటుగా నా సోదరుని డైట్‌లో ఖచ్చితంగా ఎల్లప్పుడూ భాగంగా ఉన్నది బాదములు. 

 
భారతదేశంలో అధికశాతం మంది ఇప్పటికే బాదము తినడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకునే ఉన్నారు. ఈ కారణం చేతనే అవి ప్రతి ఇంటిలోనూ అత్యంత ప్రాచుర్యం పొందాయి. కానీ, నాకిప్పటికీ గుర్తు, మా అమ్మ నాకు బాదముల వల్ల ఎంతో ప్రయోజనమని చెప్పడం, వీటిని తరచుగా తింటే చర్మపు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పేవారు. అందుకే నాతో పాటు ఎల్లప్పుడూ ఈ బాదములు వెంట ఉంచుకునే దానిని. ఇప్పటికీ ప్రతిరోజూ నా స్నాకింగ్‌లో ఓ గుప్పెడు బాదములను జోడించడం అలవాటు’’ అని సోహా అన్నారు.

 
ఆమెనే మాట్లాడుతూ, ‘‘బాదములను కూడా ఓ ఆహారంలా పరిగణించాల్సి ఉంది. దీనిలో బహుళ పోషకాంశాలు ఉన్నాయి. వీటిలో అల్ఫా టోకోఫెరాల్‌ (విటమిన్‌ ఈ) మరియు చక్కటి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ వంటివి సైతం వీటిలో ఉన్నాయి.  బాదములలో అత్యధికంగా అల్ఫా టోకోఫెరాల్‌ ఉంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్‌ ఫంక్షన్స్‌ కూడా ఉన్నాయి. చర్మం మడతలు పడటానికి, మహిళలకు నెలసరి ఆగిన తరువాత చర్మపు రంగు మారేందుకు కారణమైనది ఇది’’ అని ఇటీవల రాజ శివమణి చేసిన ఓ అధ్యయనం సూచిస్తూ వెల్లడించారు.

 
మాయిశ్చరైజ్‌ మాయిశ్చరైజ్‌ మాయిశ్చరైజ్‌...
మన కిచెన్‌లో ఎన్నో పదార్థాలు ఉంటాయి. వీటిలో చాలా వరకూ చర్మంపై ఉపయోగించేందుకు సైతం అనువుగా ఉంటాయి. చర్మ సౌందర్యం కోసం గృహ చిట్కాలను అనుసరించాల్సిన ఆవశ్యకతను మా అమ్మ నాకు ఎప్పుడూ చెబుతూనే ఉండేది. దీనిలో మొదటి అంశం  ప్రతి రోజూ మీ చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేయడం. మన చర్మం పలు వాతావరణ అంశాలతో పాటుగా సూర్యకాంతి వల్ల కూడా ప్రభావితమవుతుంది.

 
అందువల్ల, మీ చర్మానికి తగిన పోషణ అందించడంతో పాటుగా సమయానికి దానిని సరిగా పోషించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. నాకిప్పటికీ ఆ ఫేస్‌మాస్క్‌ డేస్‌ గుర్తే.  అప్పట్లో నేను విభిన్నమైన  ఫేస్‌ప్యాక్స్‌ వాడేదానిని. కొన్నిసార్లు తేనె, పసుపు కూడా రాసేదానిని. ఆ తరువాత మా అమ్మ ప్రతి రోజూ మాయిశ్చరైజర్‌ రాయమనేవారు.  అదే నాకు అలవాటుగా మారింది. ఇప్పటికీ నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలలో ఒకటి ఇదని భావిస్తున్నాను అని సోహా అన్నారు.

 
మీ చర్మం శ్వాసించేలా చేయండి
మనం తరచుగా చర్మం కప్పి ఉంచుతుంటాం. దాని వల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.  చర్మం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే వీలైనంత తక్కువగానే చర్మం కప్పి ఉంచాలని సోహా వెల్లడిస్తున్నారు. ‘‘ఓ కళాకారిణిగా నేను తరుచుగా మేకప్‌ వేస్తుంటాను. అంతేకాదు, అధిక సమయం కెమెరా ముందు, కృత్రిమ కాంతిలో గడుపుతుంటాను. అది చర్మానికి అసౌకర్యం కలిగించడంతో పాటుగా వాపుకూ కారణమవుతుంటుంది.


ఈ కారణం చేతనే నేను సన్‌స్ర్కీన్‌ వాడుతుంటాను. ఇంటి నుంచి పనిచేస్తే కాస్త కాజల్‌ పెడుతుంటాను. మన చర్మం శ్వాసించే అవకాశం అందించాలి. విస్తృతంగా వివిధ ఉత్పత్తులు వాడటం వల్ల చర్మం పగిలిపోవడం, మొటిమలు రావడం జరుగవచ్చు. చివరగా, లైట్‌ ఫేస్‌ వాష్‌తో మొహాన్ని తరచుగా శుభ్రపరుచుకోవాలి. దీనిని అనుసరించి కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ రాసుకుంటే ఆహ్లాదకరమైన భావన కలుగుతుంది’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు