హెల్మెట్ ధరించకుండా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేయడం జరిగిందని, కేసులు నమోదు చేయడమే కాకుండా లైసెన్సు సస్పెండ్ చేయడం కూడా జరిగిందని డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు.
స్థానిక బందరు రోడ్డులోని డిటిసి కార్యాలయం నుండి శుక్రవారంనాడు ఒక ప్రకటనను విడుదల చేశారు. డిటిసి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా హెల్మెట్ వినియోగించని ద్విచక్ర వాహనదారులపై చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో గురువారం ఒక్కరోజునే 372 కేసులు నమోదు చెయ్యడం జరిగిందని, అందులోభాగంగా 372 మంది డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయడం జరిగిందని ఆయన అన్నారు. సెంట్రల్ మోటార్ వాహన చట్టం 138 (F) ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారి డ్రైవింగ్ లైసెన్సులను నెలరోజులపాటు సస్పెండ్ చేయడం కూడా జరిగిందని ఆయన తెలిపారు.