ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 021 ఏప్రిల్ 19న మొదటి విడత.. జూలై 29న జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. పేదరికం చదువుకు అవరోధం కారాదని... ఉన్నత చదువులు అభ్యసిస్తేనే తల రాతలు మారుతాయని జగన్ వ్యాఖ్యానించారు.