అమ్మ కడుపు నుంచి బయటికి వచ్చిన శిశువు ఏడుపును తప్ప మరొకటి ఎరుగదు. అలాంటిది బ్రెజిల్‌లో అప్పుడే పుట్టిన ఓ శిశువు ఆస్పత్రిలో ఏడ్వకుండా డాక్టర్లను కోపంగా చూసింది. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని రియోడీ జెనెరియోలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన ఓ శిశువు తనకు కనపడిన డాక్టర్లను కోపంగా చూసిన ఫోటో నెట్టింటిని షేక్ చేస్తోంది.