జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

ఐవీఆర్

సోమవారం, 28 జులై 2025 (20:23 IST)
2024 అసెంబ్లీ ఎన్నికల పర్యటన సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన గులక రాయి విసిరి ఆయనకు గాయాలు కావడానికి కారణమైన సతీష్ ఆచూకి లభించింది. తమ కుమారుడు సతీష్ కనిపించడం లేదంటూ ఇటీవలే అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సతీష్ కోసం గాలించారు. దీనితో అతడు కడపలో వున్నట్లు కనుగొన్నారు.
 
కాగా తల్లిదండ్రులు అతడిని మందలించడం వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ నెల 18న ఇంటి నుంచి వెళ్లిపోయిన సతీష్ నేరుగా కడప ఎందుకు వెళ్లాడన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. సతీష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విజయవాడకు తరలించారు.

జగన్‌పై గులకరాయి దాడి కేసు నిందితుడు సతీశ్‌ ఆచూకీ లభ్యం

జగన్‌పై గులకరాయి దాడి కేసు నిందితుడు వేముల సతీశ్‌ ఆచూకీ లభ్యమైంది. అతడు కడపలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సతీశ్‌ కనిపించడంలేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో పోలీసులు ఆచూకీ కనుగొని వారికి… pic.twitter.com/73IrUsjC6K

— ChotaNews App (@ChotaNewsApp) July 28, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు