ఉగాది సందర్భంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో.. హైలైట్స్ ఇవే..
శనివారం, 6 ఏప్రియల్ 2019 (15:28 IST)
ఉగాది సందర్భంగా పూజలు, పంచాంగశ్రవణం నిర్వహించిన అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల మేనిఫెస్టోను నిర్వహించారు. ఈ మేనిఫెస్టోలో డ్వాక్రా సంఘాలకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రతి డ్వాక్రా మహిళకు స్మార్ట్ ఫోన్ అందజేయనున్నారు.
అంతేగాకుండా.. మేనిఫెస్టోలో వున్న హైలైట్స్ సంగతికి వస్తే..
మహిళా ఉద్యోగుల కోసం ప్రోత్సాహక నిధులతో కింద స్కూటర్లు కొనుగోలు
ఆశా, అంగన్ వాడీ కార్యకర్తల కోసం అనేక సదుపాయాలు
పెన్షన్లు రూ.3000కి పెంపు
వయోపరిమితి 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గింపు
చంద్రన్న బీమా 10 లక్షలకు పెంపు
పెళ్లి కానుక లక్ష రూపాయల పెంపు
20,000 జనాభా దాటిన అన్ని మేజర్ పంచాయతీల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు
పేద కుటుంబాలకు పండుగ వేళల్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేత
ఎస్సీ, ఎస్టీల కోసం పదేళ్ల పాటు ఉప ప్రణాళిక అమలు
100 గురుకుల పాఠశాలల స్థాపన
ఎస్టీల కోసం ప్రత్యేకంగా 50 రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీలు అన్ని వర్గాల వారికి విదేశీ విద్య కోసం రూ.28 లక్షలు
ఆదివాసీల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం, జగజ్జీవన్ రామ్ స్మృతివనం పూర్తి
మాదిగల కోసం ప్రత్యేక కార్పొరేషన్ స్థాపన
లిడ్ క్యాప్ తో సంబంధం లేకుండా మాదిగ కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు
ఐటీడీఏ పరిధిలో యానాదులకు ప్రత్యేకంగా కార్పొరేషన్
వెనుకబడిన వర్గాల కోసం రూ.10,000 కోట్లతో బీసీ డెవలప్ మెంట్ బ్యాంక్
బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత
ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో 25 శాతం ప్లాట్లు బీసీల పరం
బీసీలు స్వయం ఉపాధిలో భాగంగా ఇన్నోవా తరహా కార్ల కొనుగోలులో 25 శాతం రాయితీ
బీసీ విద్యార్థుల కోసం 200 రెసిడెన్షియల్ స్కూళ్లు
బీసీ మత్స్యకారుల క్రాప్ హాలీడే పరిహారం రూ.4000 నుంచి రూ.10,000కి పెంపు
మత్స్యకారుల డీజిల్ కొనుగోలులో లీటర్ పై రూ.10 రూపాయల వరకు ఇన్సెంటివ్ పెంపు