26 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీటిమట్టం పెరగడంతో నీట మునిగిన గ్రామాల సంఖ్య పెరుగుతుందని అంచనా. వరద బాధిత కుటుంబాలకు బియ్యం, నూనె, కూరగాయలతో సహా సహాయక సామగ్రిని అందించారు.
రిలీఫ్ సిబ్బంది దాదాపు 1.2 లక్షల వాటర్ ప్యాకెట్లు, 30,000 క్లోరిన్ మాత్రలు పంపిణీ చేశారు. ప్రజలకు చికిత్స అందించేందుకు 23 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు దినేష్‌కుమార్ తెలిపారు. వైద్యులు పడవల్లో ప్రతి ఆవాసాన్ని సందర్శించి ప్రజల ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు.