ఎపుడైనా బొక్కలో వేస్తారు జగనన్నా... ఆ రోజు వైఎస్ఆర్ సీపీ పిల్లని కాదని చేతులెత్తేస్తారు... శ్రీరెడ్డి వీడియో

ఠాగూర్

శుక్రవారం, 7 మార్చి 2025 (16:59 IST)
గత వైకాపా ప్రభుత్వంలో తన నోటికి అడ్డూ అదుపు లేకుండా పని చెప్పిన నటి శ్రీరెడ్డి ఇపుడు టీడీపీ కూటమి పాలకులను శరణు వేడుకుంటున్నారు. నోటికి తాళం వేసుకుని వైకాపా నేతలను బూతులు తిడుతున్నారు. తాజాగా ఆమె ఎక్స్ ఖాతాలో పెట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగనన్నా.. తనను ఈ రోజు కాకుంటే రేపు అయినా అరెస్టు చేసి బొక్కలో వేస్తారు.. ఆ రోజు వైఎస్ఆర్ సీపీ పిల్లని కాదని వైకాపా నేతలు చేతులెత్తేస్తారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, ఏనాడైనా తనను వైఎస్ఆర్ సీపీ పిల్లని అని చెప్పారా అంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. 
 
పైగా, పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని టచ్ చేయాలంటే ఎవరైనా జడుసుకుంటున్నారన్నారు. దీనికి కారణం... వారి కార్యకర్తలను ఓ రక్షణ కవచంలా తయారు చేశారన్నారు. ఇపుడు వైకాపా గురించి ఎవరైనా పాజిటివ్‌గా పోస్ట్ పెడితే వారిని చీల్చి చెండాడుతున్నారన్నారు. పైగా, తనను కూడా ఇపుడు కాకుంటే రేపైనా, ఎపుడైనా అరెస్టు చేయడం ఖాయమన్నారు. ఆరోజున శ్రీరెడ్డి వైఎస్ఆర్ సీపీ పిల్లని కాదని చేతులెత్తేస్తారంటూ వైకాపా నేతలను బూతు పదజాలంతో దూషించారు. 
 
కాగా, గత వైకాపా అధికారంలో ఉన్నపుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ సభ్యులు, చిరంజీవి తల్లి అంజనా దేవి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత నారా లోకేశ్‌లతో పాటు వైకాపా మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజులను శ్రీరెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. 


 

శత్రువు కూడా మన గురించి పొగిడితే దానికి వచ్చే కిక్కే వేరప్పా beta don't come in our way..... ????????????????????????????@PawanKalyan #HariHaraVeeraMallu
pic.twitter.com/43agWCTaah

— ⚔️GHANI ???? (@BheemlaBoy1) March 6, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు