ఓటు వేస్తే శ్రీవారి లడ్డు.. ఇది చిత్తూరు జిల్లాలో పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గం తొండవాడలో ఏకంగా నిన్న వైసిపి అభ్యర్థి శ్రీవారి లడ్డూను పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. ఇది తెలిసిందే. అయితే ఇందుకు ముఖ్య కారణం ఎవరో కాదు డిప్యూటీ సిఎం నారాయణస్వామే అని విపక్షాలు విరుచుకుపడ్డాయి .ఈ ఐడియాను వైసిపి మధ్ధతుదారులకు ఆయనే ఇస్తున్నారంటూ టిడిపి నాయకులు మండిపడుతున్నారు.
ఎపి కేబినెట్లో కీలక స్థానంలో ఉన్న నారాయణస్వామి, సర్పంచ్‌గా గెలుపొందిన ఒక అభ్యర్థి నుంచి శ్రీవారి లడ్డూను తీసుకోవడమే కాదు.. ఆయనే ఈ లడ్డూను పంపిణీ చేయాలని కూడా చెప్పినట్లు టిడిపి ఆరోపిస్తోంది. దీంతో ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్సించుకున్న నారాయణస్వామి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.