ఏపీ సీఎంగా నెల రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు... బాబు 4.0 ఎలా ఉంది?

వరుణ్

శుక్రవారం, 12 జులై 2024 (11:07 IST)
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించి నెల రోజుల సమయం గడిచిపోయింది. ఈ నెల రోజుల పాలన ఎలా సాగిందన్న అంశంపై ఇపుడు ఏపీలో చర్చ సాగుతుంది. అయిదేళ్లలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 4వ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు శ్రమిస్తున్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి దారిలో పెట్టేందుకు ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా పని చేస్తున్నారు. 
 
నెలరోజుల పాలనలో తనదైన మార్క్‌ను చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరి చేస్తున్నారు. ప్రభుత్వమే లేదు అనే పరిస్థితిని మార్చి... ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. నెలరోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం... మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి అడుగులు వేసింది. 
 
చంద్రబాబు అనుభవం ముద్ర కనిపించింది. ప్రభుత్వ వ్యవస్థలో మార్పు మొదలైంది. ప్రజల జీవితాలలో వెలుగు... ప్రభుత్వంపై నమ్మం కనిపిస్తోంది. వ్యవస్థలను గాడిన పెడుతున్నారు. ప్రక్షాళన మొదలు పెట్టారు.
 
రాష్ట్రంలో అశాంతి లేదు... అధికార అహంకారానికి చోటులేదు... ఆకృతాయలకు స్థానం లేదు... హంగామా, హడావుడి లేనే లేవు. సింపుల్ గవర్నమెంట్... ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది కనిపిస్తోంది. 
 
పరదాలు, బారీకేడ్లు, చెట్లు కొట్టేయదాలు లేనే లేవు. సీబీఎన్ 4.0లో మరింత దూకుడుగా చంద్రబాబు నాయుడు. అధికారం అంటే పదవి కాదు... బాధ్యత అని చాటిన నిజమైన ప్రజాప్రభుత్వంలా నెలరోజుల పాలన.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు