ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగా లేదు.. సీఎం చంద్రబాబు అసహనం

ఠాగూర్

గురువారం, 29 ఆగస్టు 2024 (12:54 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగా లేదు. ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు వారి కారణంగా దెబ్బతింటోంది. మంత్రులు జాగ్రత్తగా ఉండాలి. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులు గైడ్‌ చేయాలి. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే అంటూ వ్యాఖ్యానించారు. 
 
రాష్ట్రం గత ఐదేళ్లలో అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. ఇపుడు ఇటుక ఇటుక పేర్చుకుని నిర్మాణం మొదలుపెడితే కొందరు ఎమ్మెలు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఏపీ, పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారా చెబుతోందన్నారు. 2027 మార్చిలోగా పోలవరాన్ని పూర్తి చేసేలా కేంద్రం షెడ్యూల్‌ విడుదల చేయడం సంతోషమన్నారు. పైపెచ్చు.. పోలవరానికి రూ.12,127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు