వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయనకు చెందిన సాక్షి పత్రికకు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకున్నట్టుగా సాక్షి పత్రిక ఒక ఫోటోను ప్రచురించింది. దీనిపై మంత్రి లోకేశ్, మండిపడ్డారు. సాక్షితో తప్పుడు కథనం రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ ఫోటోతో విష ప్రచారం చేస్తున్నారని, పోలీసులపై ఎలాంటి దాడి జరగలేదని అన్నారు. యజమాని జగన్ ఫేక్ పనులు చేస్తుంటే, ఆయన క్విడ్ ప్రోకో విష పుత్రిక సాక్షి క్షేక్ రాతలు రాస్తుందని ఎక్స్ వేదికగా ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు రాతలు రాస్తే సాక్షిపై చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన రియల్ వీడియోను లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోపక్క తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. ఫేక్‌గాళ్లను నమ్మొద్దు.. ఫేక్‌గాళ్ళను నమొద్దు.. ఫేక్ రాజకీయాల ట్రాప్‌లో పడి మోసపోవద్దు అంటూ హితవు పలికారు.