టీడీపీ నేతలు రైతుల్ని మోసం చేసి వారి పేరుతోనే రియల్ ఎస్టేట్ యాత్ర చేస్తున్నారని ఏపీ రవాణ, సమాచార శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఫైర్ అయ్యారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలే దొంగ పాదయాత్రలు చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాత్రకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
కోర్టు, న్యాయమూర్తుల కళ్లు కప్పి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రకి నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబే. ఈ యాత్రకి చందాల పేరుతో చంద్రబాబు అండ్‌కో తమ నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.