మసీదులలో లేదా చర్చిలలో హిందువులను పనిచేయడానికి అనుమతిస్తారా? (video)

సెల్వి

శుక్రవారం, 11 జులై 2025 (14:04 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో 1,000 మందికి పైగా హిందువులు కానివారు పనిచేస్తున్నారని వస్తున్న వార్తలపై రాష్ట్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, హిందువులు మసీదులలో లేదా చర్చిలలో పనిచేయడానికి అనుమతిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఆలయ పరిపాలనలో హిందువులు కాని వారిని తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని టీటీడీ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 
 
టీటీడీ మతపరమైన పవిత్రతను పునరుద్ఘాటించిన బండి సంజయ్.. లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగివున్న తిరుమలలో హిందువులు మాత్రమే ఆలయ నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలలో పాల్గొనాలని సంజయ్ తెలిపారు. 
 
తన మీడియా సంభాషణలో, కొండగట్టు, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయంతో సహా తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాల అభివృద్ధిని చేపట్టాలని టీటీడీ  ఛైర్మన్‌ను కోరినట్లు కూడా పేర్కొన్నారు. 
 
అదనంగా, అవసరమైన నిధులను కేటాయించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురాతన దేవాలయాలను గుర్తించి పునరుద్ధరణకు మద్దతు ఇవ్వాలని ఆయన టీటీడీని కోరారు.

Visited Tirumala today and took the divine blessings of Sri Venkateshwara Swamy. Prayed for peace, prosperity, and strength to all our people and to Hon’ble Prime Minister Shri @narendramodi ji who is tirelessly working for Bharat.

Request the @TTDevasthanams board to act -… pic.twitter.com/tivHRyn3z3

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 11, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు