విజయసాయిరెడ్డితో పాటు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కూడా పీఏసీలో సభ్యుడిగా కొనసాగుతారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రధాన విధి కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను, ప్రభుత్వ ఖాతాలను పరిశీలించడం. కాగా, తాజా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటుపై రాజ్యసభ ప్రధాన కార్యదర్శి దేశ్ దీపక్ శర్మ పార్లమెంటు బులెటిన్ ద్వారా వెల్లడించారు. విజయసాయి, సుధాంశు త్రివేది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే..ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది హైకోర్టు. ముందుగా ఈడీ కేసులను విచారిచాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో విజయ సాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
మొదట సీబీఐ లేదా రెండూ సమాంతరంగా విచారణ జరపాలని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే… ఎంపి విజయ సాయిరెడ్డి వాదనను తోసిపుచ్చుతూ, సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టి వేసింది ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు.