తాజా ఎన్నికల ఫలితాలతో ఢీలా పడ్డ తెలుగుదేశం పార్టీ శ్రేణులు 2023లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, బలమైన ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీ కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు పరిమితం అయిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించారు.
అందులో భాగంగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృదంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ ఉత్తరాది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. 2014 మోడీ విజయంలోనూ, నితీష్ కుమార్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకే టీం పాజిటివ్ ఫలితాలు వచ్చినా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌కు వర్కవుట్ కాలేదు.