విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. సీ ప్లేన్స్ లాంచ్‌తో పర్యాటకంగా విజయవాడ మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు.
శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది, బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఆ పరిధిలో ఉన్న స్థలాలకు మహర్దశ పట్టనుంది.
విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండోదశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల జాతీయస్థాయి డ్రోన్ సమిట్ నిర్వహించగా ఇప్పుడు సీ ప్లేన్ ప్రయోగం చేస్తున్నారు.