గత ఏడాది తొలి విడతగా చెల్లించిన రూ.6,318.76 కోట్లు కూడా కలిపితే పొదుపు సంఘాల అప్పునకు సంబంధించి రూ.12,758.28 కోట్లు మహిళలకు అందజేసినట్టవుతుంది. ఈ పథకం ద్వారా ఇచ్చే డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.