సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు, సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ సహా వివిధ అంశాలపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
సమస్యలపై రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తామని సజ్జల హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేయాలని సంఘాలు కోరారు.