ఇంకా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోంది. గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు కరోనా సోకగా ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడంలో విఫలం కావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బెంగుళూరు బయలుదేరాడని, ఇంతలోనే ఊపిరి అందక రైల్వే స్టేషన్లో చనిపోయారన్నారు.
మృతుడి సోదరుడిని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు లభించక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదనీ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో పరిశీలన చేయాలని అలసత్వం వీడి ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.