అధైర్య పడకండి మేమంతా మీకు ఉన్నాం: కరోనా రోగులతో చెవిరెడ్డి

బుధవారం, 5 మే 2021 (20:27 IST)
తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి జిల్లా కోవిడ్ కేర్ సెంటర్‌ను బుధవారం సందర్శించారు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆక్సిజన్ తీసుకుంటూ బెడ్లపై ఉన్న కరోనా బాధితులను స్వయంగా పలకరించి ధైర్యం చెప్పారు. అధైర్య పడవద్దని మేమంతా ఉన్నామంటూ భరోసా కల్పించారు.
 
ఈ కేంద్రంలో ఉన్న వేయి మంది కరోనా బాధితులకు అందుతున్న సౌకర్యాల పట్ల ఎమ్మెల్యే అధికారులను ఆరా తీశారు. దేశంలోనే శ్రీ పద్మావతి జిల్లా కోవిడ్ కేర్ సెంటర్‌కు గొప్ప పేరుంది. మన సేవలను కూడా ఆ స్థాయిలో మరింత ఇనుమడింప చేసేలా కరోనా బాధితులకు సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
 
నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీ పదరాదని స్పష్టం చేశారు. చిన్న పాటి సమస్యలు ఏవైనా ఉంటే త్వరితగతిన అధిగమించాలని అధికారులను ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు