ఏపీలో కొత్త జిల్లాలు.. జనసేనాని ఏమన్నారంటే?

సోమవారం, 4 ఏప్రియల్ 2022 (18:36 IST)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, పాలన ప్రారంభమై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీ పాలకుల కోరిక మేరకు ఇష్టారీతిన జిల్లాల విభజన జరిగిందని పవన్ కల్యాణ్ చెప్పారు. 
 
లోపభూయిష్టంగా జిల్లాల విభజన జరిగిందని, ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేపట్టారని పవన్ విమర్శించారు. 
 
జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాలని, కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కూడా ఇబ్బందులు తప్పడం లేదని పవన్‌కల్యాణ్‌ అన్నారు. 
 
రంపచోడవరం కేంద్రంగా ఉండాలన్న గిరిజనుల అభిప్రాయం పట్టించుకోలేదని, రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు