కోవిడ్-19 నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ 800 మంది మహిళలు దీపాలు వెలిగించేలా ఏర్పాటుచేశారు. వేదికను శోభాయమానంగా పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 8.15 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా వేదస్వస్తి, సంకీర్తన గానం, పుణ్యాహవచనం/అగ‌్నిప్రతిష్ట, శ్రీ సూక్తహోమం, శ్రీ లక్ష్మీ చతుర్వింశతి నామావళితో అర్చన నిర్వహిస్తారు.
ఆ తరువాత అష్టలక్ష్మీ స్తోత్ర కూచిపూడి నృత్యం, దీపారాధన, సామూహిక దీపనీరాజనం, గోవిందనామాలు, నక్షత్ర హారతి, కుంభ హారతి, కర్పూరహారతి ఇస్తారు.