ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణాలో 7 నవోదయ స్కూల్స్ నెలకొల్పనున్నట్టు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఇందులో ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించారు.
వీటిని అనకాపల్లి, చిత్తూరు జిల్లా వలసపల్లె, సత్యసాయి జిల్లా పాలసముద్రం, గుంటూరు జిల్లా తాళ్లపల్లె, పల్నాడు జిల్లా రొంపిచెర్ల, కృష్ణా జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు, నంద్యాల జిల్లా డోన్లలో ఏర్పాటు చేయనున్నారు.
అలాగే, తెలంగాణ రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలను కేంద్రం కేటాయించింది. వీటిని రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకే కేంద్రం సమ్మతం తెలిపింది.