బ్రిటీష్ వారు దేశాన్ని విడిచిపెట్టే సమయానికి అనేక రాచరిక రాష్ట్రాలు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నాయని, అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్ని రాచరిక రాష్ట్రాలు భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని, ఒకే దేశంగా ఉండాలని నిర్ణయించి విలీన ప్రక్రియను వేగవంతం చేశారన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రయత్నం, పట్టుదల కారణంగానే అఖండ భారతదేశం సాధ్యమైందని గవర్నర్ చెప్పారు. స్వతంత్రంగా ఉండాలని కోరుకున్న 558 రాచరిక రాష్ట్రాలు భారతదేశంలో విలీనం అయ్యాయని, లేకపోతే ఈ రోజు మనం సువిశాల భారత దేశాన్ని చూడలేక పోయేవారమని హరి చందన్ అన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం యొక్క ఐక్యత, సమగ్రతకు గొప్ప కృషి చేశారని, ఆయనను దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని గవర్నర్ అన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.