పులిచింత‌ల‌కు బ‌య‌లుదేరిన టీడీపీ నేత‌ల అడ్డ‌గింత‌

సోమవారం, 9 ఆగస్టు 2021 (12:24 IST)
పులిచింతల ప్రాజెక్టు ప్రాజెక్టు 16 వగేటు విరిగిపోవ‌డంతో, ఆ స్ధానంలో అమర్చిన స్టాప్ లాక్ గేటు  సందర్శిస్తామంటూ బయలుదేరిన గుంటూరు జిల్లా టిడిపి నాయకులను చేదు అనుభ‌వం ఎదుర‌యింది. పులిచింత‌ల ప‌ర్య‌ట‌న‌కు అనుమతి లేదంటూ పోలీసులు నిలపివేయటంతో టీడీపీ నేత‌లు గుంటూరు శివారులో ఆందోళనకు దిగారు. 
 
టిడిపి నిజనిర్ధారణ కమిటీలో పార్టీ నాయకులు జివీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాస్ తదితరులు ఉండగా, ప్రాజెక్టు వద్ద పోలీసు ఆంక్షలు కోనసాగటంతో, వారిని ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పులిచింతల ప్రాజెక్టు 16 గేటు సందర్శించడానికి వచ్చిన టిడిపి మాజీ ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు జీవి ఆంజనేయులు కొమ్మలపాటి శ్రీధర్‌లతో పాటు ఇతర టిడిపి మాదిపాడు వద్ద పోలీసులు అడ్డుకోవటం స్వల్ప ఉదిక్తతకు దారితీసింది.

వైసీపీ నేత‌లు మాత్రం పులిచింత‌ను స‌ద‌ర్శించి వ‌స్తున్నార‌ని, తెలుగుదేశం నేత‌ల‌కు మాత్రం అన్ని అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని పోలీసుల‌పై టీడీపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. అయినా వారికి అనుమ‌తి లేద‌ని పోలీసులు అడ్డ‌గించారు. పోలీసులను ప్రతిఘటించిన అనంతరం పులిచింతల డ్యామ్ పైకి చేరుకున్న టిడిపి నేతలు,16 వ గేటు, స్టాప్ లాక్ లను ఎట్ట‌కేల‌కు పరిశీలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు