అది టీటీడీ బోర్డు కాదు..డెకాయిట్‌ల బోర్డు: టీడీపీ

గురువారం, 26 సెప్టెంబరు 2019 (08:08 IST)
‘‘టీటీడీ బోర్డుని సీబీఐ చార్జ్‌ షీట్‌ చిట్టాలా చేశారు. 36 మందికి దేవుడి సొమ్ము పంచిపెట్టే అధికారం ఎవరిచ్చారు? జగన్‌, కేసీఆర్‌ బినామీలకు టీటీడీ జంబో బోర్డు కట్టబెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఇది క్విడ్‌ ప్రోకో చిట్టా. అది డెకాయిట్‌ల బోర్డులా ఉంది’’ అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.

నాడు టీడీపీ ప్రభుత్వం శేఖర్‌రెడ్డిని తమిళనాడు ప్రభుత్వ సిఫార్సు మేరకే బోర్డు సభ్యుడిగా నియమించిందన్నారు. అప్పుడు అతనిపై ఎలాంటి కేసులు లేవని, ఈడీ కేసు పెట్టగానే శేఖర్‌రెడ్డిని తొలిగించామన్నారు. అప్పుడు రూ.100 కోట్లు కుంభకోణమని ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు బోర్డు సభ్యుడిగా ఎలా నియమించారని ప్రశ్నించా రు.
 
అలానే అన్ని నామినేటెడ్‌ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 50 శాతం ఇస్తామన్న హామీ ఏమైయిందన్నారు. తెలంగాణలోని యాదాద్రి, భద్రాచలం రామాలయం, వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ కమిటీల్లో కేసీఆర్‌ ఆంధ్ర వారి కి ఎన్ని పదవులిచ్చారని ప్రశ్నించిన అనురాధ ఈ విషయాల పై సీఎం జగన్‌ నోరు తెరవాలన్నారు.

మాజీ హోం మంత్రి చినరాజప్ప.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభు త్వం టీటీడీ బోర్డు నియామకాలు చేసిందని కాకినాడలో విమర్శించారు. కాగా, టీడీపీ బోర్డులో గరిష్ఠంగా 29 మంది పాలక మండలి సభ్యులను నియమించడాన్ని బీజేవైఎం అధ్యక్షుడు రమేశ్‌ నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు.

హిందూయేతర మతాలను ప్రోత్సహించేవారిని, అక్రమార్కులను, అధర్మ వ్యక్తులను నియమించి తప్పుచేశారని మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు