రోజూ పాత స్కూటర్‌పై రైల్వే స్టేషన్‌కు వెళ్తూ, అక్కడి నుండి రైలులో అనకాపల్లిలోని తన కార్యాలయానికి వెళ్లే ఒక ఉద్యోగి కూడబెట్టిన ఆస్తుల వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. భూములు, భవనాలు, బంగారం, వెండి, నగదు, ఇలా గురువారం అధికారులు జరిపిన ఐటి దాడులలో చిక్కిన అవినీతి అధికారి అక్రమార్జన అంతులేకుండా పోయింది.
అనకాపల్లిలో భూగర్భశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న గుండు శివాజీ 1993లో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరి, తర్వాత పదోన్నతులు పొంది ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలో భారీగా భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాల రూపంలో అక్రమాస్తులు కలిగి ఉన్నాడు. ఇతని గురించి ఫిర్యాదులు అందుకున్న ఐటీ విభాగం ఆరు నెలల నుండి నిఘా ఉంచి, గురువారం నాడు ఏడు బృందాలుగా విడిపోయి ఏక కాలంలో ఏడు చోట్ల ఐటీ సోదాలు నిర్వహించారు.
శివాజీ ఇంట్లో 240 గ్రాముల బంగారం, 3.3 కిలోల వెండి, 10 లక్షల రూపాయలు ఉన్నట్లు కనిపెట్టారు. వాటర్ క్యాన్‌లో సుమారు 10 లక్షలు పెట్టి, తన బెడ్రూంలో ఉంచుకున్నాడు గుండు శివాజీ. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు లెక్కగట్టినా వీటి విలువ 50 కోట్లకు పైమాటేనని ఏసీబీ అధికారులే చెప్తున్నారు.