అనారోగ్యానికిగురై, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తిరుప్పరకుండ్రం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఏకే బోస్ పోటీ చేశారు. అయితే, ఈయన సమర్పించిన బిఫామ్ పత్రంలో జయలలిత వేలి ముద్ర వేశారు.
ఈ పిటీషన్‌పై విచారణ సమయంలో హాజరైన ప్రభుత్వ వైద్యుడు పి. బాలాజీ... ఆ వేలి ముద్ర మాజీ సీఎం జయలలితదే అని ధృవీకరించారు. పోలింగ్ డాక్యుమెంట్లపై ఉన్న వేలిముద్రలు జయవే అని ఆయన స్పష్టం చేశారు. బీ-ఫారమ్‌లో ఉన్న వివరాలను చదివిన తర్వాత.. జయనే ఆ వేలిముద్ర వేసినట్లు డాక్టర్ బాలాజీ.. మద్రాస్ హైకోర్టుకు విన్నవించారు. వేలముద్ర వేసిన సమయంలో జయ పక్కన ఆమె స్నేహితురాలు వీకే శశికళ మాత్రమే ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. 2016, అక్టోబర్ 27 సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ వేలిముద్రలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.