రహదారి భద్రతపై బైక్ ర్యాలీతో అవగాహన కల్పిస్తున్న జియో

ఐవీఆర్

గురువారం, 30 జనవరి 2025 (18:09 IST)
విశాఖపట్నం: రిలయన్స్ జియో జనవరి నెలను రహదారి భద్రతా నెలగా గుర్తించి సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం సిరిపురం జియో సెంటర్ నుండి ట్రాఫిక్ పోలీసు విభాగం సహకారంతో బైక్ ర్యాలీ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జియో అధికారులు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. 
 
ఈ ర్యాలీ రహదారి భద్రత ప్రతిజ్ఞతో ప్రారంభమైంది, ఇందులో బాధ్యతాయుతమైన డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల అనుసరణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పాల్గొన్న వారు RTC కాంప్లెక్స్ జంక్షన్, రామ టాకీస్ రోడ్డు, మస్జిద్ జంక్షన్, VIP రోడ్డు, దత్ ఐలాండ్ జంక్షన్, సిరిపురం జంక్షన్ ద్వారా ప్రయాణించి, సిరిపురం జియో సెంటర్ వద్ద ర్యాలీని ముగించారు.
 

రహదారి భద్రతపై బైక్ ర్యాలీతో అవగాహన కల్పిస్తున్న జియో #Jio #RoadSafetyCampaign #BikeRally #Visakhapatnam pic.twitter.com/AeHEV5I0Yl

— Webdunia Telugu (@WebduniaTelugu) January 30, 2025
ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో రహదారి భద్రత యొక్క ప్రాముఖ్యతను మరింత బలపరుస్తుంది. 'సడక్ సురక్ష-జీవన్ రక్ష' అనే థీమ్‌తో ఈ నెల పొడవునా సాగే ప్రచారం, యువతను చైతన్యపరచడం, అవగాహనను వ్యాప్తి చేయడం, ప్రవర్తనా మార్పులను ప్రోత్సహించడం, రహదారి ప్రమాద మరణాలను, గాయాలను తగ్గించడం లక్ష్యంగా నిర్వహించబడుతోంది. ప్రతి ఒక్కరిని జాతీయ రహదారి భద్రతా ప్రచారంలో చేరాలని, భద్రమైన రహదారులను ప్రోత్సహించడంలో క్రియాశీల పాత్ర పోషించాలని జియో విజ్ఞప్తి చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు