పూజ పేరుతో నయవంచన... ప్రశ్నించినందుకు సామూహిక అత్యాచారం!!

ఠాగూర్

మంగళవారం, 25 మార్చి 2025 (09:38 IST)
పూజ పేరుతో ఓ మహిళ వద్ద భారీ మొత్తాన్ని వసూలు చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఓ గురూజీతో సహా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు సమీపంలోని యశ్వంతపురకు చెందిన కిరణ్ కుమార్ గురూజీ, లోహిత్ అనే ఇద్దరు వ్యక్తులు పలువురు మహిళలకు మాయమాటలు చెప్పి వారి కష్టాలు బాధలు తీరుస్తామని నమ్మించి ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. ఈ క్రమంలో ఓ మహిళకు మాయమాటలు చెప్పి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు డబ్బులు బాగా గుంజారు. దీనిపై బాధితులు సుబ్రహ్మణ్య నగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారిద్దరిపై బాధిత మహిళ (49) పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
మూడేళ్ల కిందటే ఆమెతో వారికి పరిచయం ఏర్పడింది. మీ భర్త ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. "ఆ ముప్పు తప్పాలంటే ప్రత్యేక పూజ చేయాలి" అని ఆమెను భయపెట్టారు. పూజ పేరుతో భారీగా డబ్బు గుంజారనేది ఆరోపణ. దశలవారీగా నగదు తీసుకోవడంత పాటు ఆమె పేరుమీదన్న ఆస్తులు, బంగారు నగలు కాజేశారని పోలీసులు తెలిపారు. అనుమానం వచ్చిన ఆమె డబ్బు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. నిందితులిద్దరూ ఆమెపై దాడి చేసి, లైంగిక, దౌర్జన్యానికి పాల్పడ్డరాని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు