'ప్చ్‌ వయసు పైబడుతోంది'.. బర్త్‌డే విషెస్‌పై కేటీఆర్ ట్వీట్

మంగళవారం, 24 జులై 2018 (10:49 IST)
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టిన జోరు వేడుకలు మంగళవారం జరుగుతున్నాయి. అదేసమయంలో ఆయన గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన 42 ఏళ్లు పూర్తి చేసుకుని 43 యేటలోకి అడుగుపెడుతున్నారు. బర్త్‌డే సందర్భంగా కేటీఆర్‌కు ట్విట్టర్‌లో విషెస్‌ వెల్లువెత్తాయి. వీటిపై ఆయన తనదైనశైలిలో స్పందించారు.
 
'ప్చ్‌ వయసు పైబడుతోంది' అంటూ లైటర్‌ వెయిన్‌లో పంచ్‌ పేల్చారు. 'నాకు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ అందరినీ కలవాలని, ధన్యవాదాలు చెప్పాలని ఉంది. కానీ.. ఆదివారం సాయంత్రం నుంచి జ్వరంతో బాధపడుతన్నా..' అంటూ ట్వీట్ చేశారు. 
 
అదేసమయంలో తన పుట్టినరోజు నాడు హంగామా చేయొద్దంటూ మిత్రులు, శ్రేయోభిలాషులకు ఇప్పటికే ఆయన సూచన చేశారు. ఆర్భాటాలతో తన పుట్టినరోజును జరిపేకంటే.. ఆ ఖర్చు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని ఆయన సూచించారు. అనుమతి లేకుండా పెట్టిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను తక్షణమే తొలిగించాలని అధికారులను ఆదేశించారు.

 

Many many thanks for all the greetings & affection. Would’ve loved to meet and greet but down with fever since Sunday evening

Guess age is catching up

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు