కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం లాక్ డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అనేక సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా లిక్కర్ షాపులు కూడా ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పలు రాష్ట్రాలు కరోనా కేసులు తక్కువగా ఉన్న ఏరియాల్లో మద్యం సేల్స్‌కు అనుమతి ఇచ్చాయి.
లాక్ డౌన్‌లో దాదాపుగా 40 రోజుల పాటు మద్యం దొరక్కపోయే సరికి నాలుక ఎండిపోయినట్లయింది. గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లలో మద్యంపై ఆంక్షలు సడలించడంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
అయితే ముందస్తు జాగ్రత్తలతో బెంగళూరుకు చెందిన పలువురు భారీ ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. మాస్క్ కొనుక్కోమంటే కొనుక్కుంటారో లేదో తెలియదు కానీ లిక్కర్ కొనుగోలుకు ఎగబడుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.52వేల లిక్కర్ కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన బిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.