దళితులే టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతారు : ఆర్కే.రోజా

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (20:27 IST)
తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎమ్మెల్యే ఆర్కే.రోజా మండిపడ్డారు. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కదిరిలో బుధవారం ఆమె అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
 
'ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చింతమనేనికి ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితుల గురించి అవహేళనగా మాట్లాడారు. స్వయానా సీఎం చంద్రబాబు కూడా దళిత వర్గాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో దళితులే టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతారు' అని రోజా హెచ్చరించారు.
 
ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ, 'రాజకీయంగా మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మేము అగ్రకులాలకు చెందిన వాళ్లం. మాకు రాజకీయాలుంటాయి. పదవులు మాకే. మీరు దళితులు. వెనుకబడిన వారు. షెడ్యూల్డ్‌ కాస్ట్‌కు చెందిన వారు. మీకెందుకురా రాజకీయాలు. పిచ్చ......లారా' అని దుర్భాషలాడారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వెలుగులోకి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు