అగ్నికి ఆహుతైన అంతర్వేది రథం - ఓ మతంపై జరిగిన దాడి : వైకాపా ఎంపీ

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (11:23 IST)
అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన రథం అగ్నికి ఆహుతి కావడం వెనుక పెద్ద కుట్రే ఉందని వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. అంతర్వేదిలో క్రీ.పూ.300 సమయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి చెందిన ఊరేగింపు రథం అగ్నికి ఆహుతి అయింది.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, రథం కాలిపోయిన విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ అనుమానం కలుగుతోందన్నారు. కింది నుంచి పైదాకా ఒకేసారి ఈ రథం తగులబడటం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఒకవేళ కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఉంటే ఈ రకంగా రథం పూర్తిగా బూడిదయ్యే అవకాశం లేదన్నారు. 
 
'గతంలో కొన్ని చోట్ల ఇలాగే జరిగితే ఎవరో పిచ్చివాళ్లు చేశారని ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఎవరో పిచ్చివారి పిచ్చిచేష్ఠగానే ముద్రవేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ ఘటన చూస్తుంటే... కావాలని ఒక మతంపై జరిగిన దాడిలా అనిపిస్తోంది. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ కేవలం ప్రకటనతోనే సరిపెట్టుకోకుండా దోషులను పట్టుకుని, కఠినంగా శిక్షించాలి' అని డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు